ఎవరికోసం శింబు లండన్‌కి వెళ్లారో తెలుసా?
on Jun 7, 2023
శింబు ఇప్పుడు స్కై హైలో ఉన్నారు. ఆయన చేసిన సినిమాలు వరుసగా విజయం సాధిస్తుండటంతో అదే జోరుమీద నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు. ఈ మధ్యనే థాయ్‌ల్యాండ్ కి వెళ్లొచ్చారు శింబు. ఆ వెంటనే కొన్నాళ్లు చెన్నైలో ఉండి లండన్‌కి వెళ్లారు. అక్కడ దేశింగ్ పెరియసామి సినిమా కోసం మేకోవర్ అవుతున్నట్టు టాక్. దేశింగ్ పెరియసామి దర్శకత్వంలో ఎస్టీఆర్ 48 ఉంటుందని గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. ఆగస్టులో చిత్రాన్ని ఫ్లోర్ మీదకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమాను కమల్‌హాసన్ నిర్మిస్తున్నారు.
మే 22న సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి శింబు హెక్టిక్ ట్రైనింగ్‌లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా లండన్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. పీరియాడిక్ సబ్జెక్ట్ ని శింబు కోసం ప్రిపేర్ చేశారు దేశింగ్ పెరియసామి. వారియర్ ప్రిన్స్ గా కనిపిస్తారు శింబు. అందుకోసమే ఇప్పుడు లండన్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అక్కడ గుర్రపు స్వారి, కత్తి ఫైట్, రోయింగ్ కూడా నేర్చుకుంటున్నారు. బడ్జెట్‌కి ఎక్కడా వెనకాడకుండా ఖర్చుపెడుతున్నారు కమల్‌హాసన్. అత్యంత భారీ స్థాయిలో పీరియాడిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు హ్యాపీగా ఉందని కమల్ సన్నిహితులతో అన్నారట. చిత్రంలో యాక్షన్ పార్ట్ కి మంచి ఇంపార్టెన్స్ ఉండటంతో, కమల్ కూడా శింబుకి సలహాలు ఇస్తున్నారట. కమల్ సూచన ప్రకారమే శింబు ఇటీవల థాయ్‌ల్యాండ్‌కి వెళ్లారట. శింబు సిక్స్ ప్యాక్ ఫ్యాన్స్ కి ట్రీటే అంటున్నాయి సినీ వర్గాలు. క్రబీ దగ్గర్లో స్టే చేసి, అనుకున్న ఫిజిక్ సాధించుకుని తిరిగి వచ్చారన్నది ట్రెండ్ అవుతున్న న్యూస్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
