'#SSMB28': ఫస్ట్ లుక్, టైటిల్ కి ముహూర్తం ఫిక్స్!
on Jun 26, 2022
ఆ మధ్య వెర్సటైల్ కెప్టెన్ గుణశేఖర్ తో మూడు సినిమాలు చేసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో ప్రయత్నం చేయబోతున్నారు. `అతడు` (2005), `ఖలేజా` (2010) వంటి క్లాసిక్స్ తరువాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా.. `#SSMB 28` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే, `#SSMB 28`కి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ని మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ గా ఆగస్టు 9న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. కుదిరితే, ఓ స్పెషల్ వీడియో గ్లిమ్స్ ని కూడా విడుదల చేసేలా త్రివిక్రమ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, `#SSMB 28`లో మహేశ్ బాబుకి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే ఎంటర్టైన్ చేయనుంది. యువ సంగీత సంచలనం తమన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందించనున్నాడు. 2023 వేసవిలో `#SSMB 28` తెరపైకి వచ్చే అవకాశముంది.