'హీరో' ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక ధీరుడు
on Jan 10, 2022

టాలీవుడ్ కి మరో వారసుడు హీరోగా పరిచయమవుతున్నాడు. సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వస్తున్న అతని పేరు గల్లా అశోక్. ఓ వైపు తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడిగా.. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడిగా 'హీరో' అనే సినిమాతో జనవరి 15 న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న 'హీరో' సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదలైంది.
టైటిల్ కి తగ్గట్లే సినిమా హీరో అవ్వడానికి ప్రయత్నించే ఓ యువకుడి కథే ఈ 'హీరో' సినిమా అని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. 'సినిమాల్లో హీరో అవుదామనుకున్న వాళ్ళు చాలామంది జీవితాలను నాశనం చేసుకున్నారు' అంటూ నిధి అగర్వాల్ తండ్రి పాత్రలో నటించిన జగపతిబాబు.. హీరోహీరోయిన్ల ప్రేమని వ్యతిరేకిస్తున్నట్లుగా ట్రైలర్ లో కనిపించింది. ట్రైలర్ లో అశోక్ డ్యాన్స్ లు, ఫైట్స్ తో అదరగొట్టాడు. సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య వంటి వారు ఈ సినిమాలో వినోదాన్ని పంచనున్నారని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. అశోక్ డెబ్యూ మూవీ అయినప్పటికీ ఈ సినిమా కోసం గల్లా ఫ్యామిలీ బాగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

'భలే మంచి రోజు', 'శమంతకమణి', 'దేవ దాస్' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య.. అశోక్ డెబ్యూ మూవీగా వస్తున్న 'హీరో'తో సంక్రాంతి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



