మొన్న విడాకుల న్యూస్.. నేడు తల్లి కాబోతున్నట్లు ప్రకటన
on Jan 10, 2022

బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంజనా తల్లి కాబోతోంది. ప్రస్తుతం తాను ఐదు నెలల గర్భవతినని, డెలివరీ ముందు వరకు కూడా తాను విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదని తాజాగా ఆమె తెలిపింది.
గతేడాది కన్నడ సినీ పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంజనా మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె తన ప్రియుడు అజీజ్ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. అయితే ఇటీవల సంజనా ఆమె భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ విడాకుల వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంజనా.. తాజాగా అభిమానులతో ఓ గుడ్ న్యూస్ ని పంచుకుంది.
"మాతృత్వం అనేది ఓ అందమైన అనుభూతి. ఇప్పుడు నేను ఐదు నెలల గర్భవతిని. డెలివరీ అయ్యేంత వరకు నేను విశ్రాంతి తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. చాలామంది మహిళలు తమ డెలివరీ తేదీకి రెండు వారాల ముందు వరకు పనులు చేయడం చూశాను. ఇప్పుడు నేను కూడా అదే విధంగా ఉండాలనుకుంటున్నాను" సంజనా చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



