బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం.. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?
on Dec 3, 2025

హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. డిసెంబర్ 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలసుబ్రహ్మణ్యం బావమరిది, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. మరికొద్ది రోజుల్లో విగ్రహావిష్కరణ జరగనుండగా ఇప్పుడు వివాదం తలెత్తింది. (SP Balasubrahmanyam)
రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు చేయడంపై కొందరు తెలంగాణ ఉద్యమకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఏపీ వారి విగ్రహాలు ఎందుకని.. తెలంగాణ ప్రముఖులు గద్దర్, అందెశ్రీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రవీంద్రభారతికి వెళ్ళిన శుభలేఖ సుధాకర్ కి, ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటుని వ్యతిరేకిస్తున్న వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగువారి ఆస్తి అని, ఆయన విగ్రహం పెట్టడంలో తప్పేముందని అంటుండగా.. మరికొందరు మాత్రం విగ్రహ ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నారు.
వివాదం తలెత్తిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? డిసెంబర్ 15న విగ్రహావిష్కరణకు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



