'విక్రమ్' కంటే 'మేజర్' తక్కువే!
on Jun 2, 2022

ఈ శుక్రవారం (జూన్ 3) రెండు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలే.. `విక్రమ్`, `మేజర్`. లోక నాయకుడు కమల్ హాసన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో `ఖైదీ`, `మాస్టర్` చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన `విక్రమ్` యాక్షన్ థ్రిల్లర్ గా ఎంటర్టైన్ చేయనుండగా.. ఆర్మీ అధికారి మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ ప్రధాన పాత్రలో `గూఢచారి` ఫేమ్ శశికిరణ్ తిక్క తీర్చిదిద్దిన `మేజర్` బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ గా రాబోతోంది.
ఇదిలా ఉంటే.. మరికొద్ది గంటల్లో జనం ముందుకు రాబోతున్న `విక్రమ్`, `మేజర్` చిత్రాలకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 173 నిమిషాలు (2 గంటల 53 నిమిషాలు) భారీ నిడివితో `విక్రమ్` వినోదాలు పంచనుండగా.. కేవలం 150 నిమిషాల (2 గంటల 30 నిమిషాలు) రీజనబుల్ డ్యూరేషన్ తో `మేజర్` అలరించేందుకు సిద్ధమైంది. సో.. రన్ టైమ్ విషయంలో `విక్రమ్` కంటే `మేజర్`కే అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మరి.. ఈ వారం బాక్సాఫీస్ వార్ లో ఈ రెండు చిత్రాల్లో దేనికి ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



