'రూల్స్ రంజన్'గా మారిన కిరణ్ అబ్బవరం.. మాములు స్పీడ్ కాదు!
on Jul 15, 2022

'రాజావారు రాణిగారు', 'ఎస్.ఆర్.కళ్యాణ్ మండపం' సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా మరో కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ తో వచ్చాడు.
ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'రూల్స్ రంజన్'. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'డి.జె.టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించనుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది.

ఈరోజు కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా 'రూల్స్ రంజన్' సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ చూస్తుంటే కిరణ్ అబ్బవరం బిజినెస్ మ్యాన్ సూట్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో రాసున్న రూల్స్ ని బట్టి చూస్తే రూల్స్ పేరుతో ఎంప్లాయిస్ ని ఇబ్బంది పెట్టే బాస్ క్యారెక్టర్ అనిపిస్తుంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్, సిద్ధార్థ సేన్,అతుల్ పర్చురే, ఆశిష్ విద్యార్థి, అజయ్ తదితరులు నటిస్తున్నారు. అమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్ గా దులీప్ కుమార్, ఎడిటర్ గా వరప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



