‘రుద్రమదేవి’ పుట్టినరోజున టీజర్
on Nov 2, 2014
.jpg)
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అనుష్క బర్త్‌డే గిఫ్ట్‌గా ‘మేకింగ్ ఆఫ్ రుద్రమదేవి’ వీడియోను ప్రత్యేకంగా రూపొందించి ఆరోజున రిలీజ్ చేస్తామని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, సుమన్, కెథరిన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



