రజినీకాంత్ ‘లింగా’ ట్రైలర్
on Nov 2, 2014
.jpg)
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘లింగా’.కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా, టాలీవుడ్ బ్యూటీ అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఇక విషయానికొస్తే.. రజనీకాంత్ స్టయిల్స్, ఇద్దరు హీరోయిన్లతో రజనీ పాటలు, ఫైట్స్ వంటి సీన్లు ఇందులో వున్నాయి. మాటలు గానీ పాటలు గానీ ఎక్కడా లేకుండా ‘లింగా’ అనే టైటిల్‌తోనే ఈ టీజర్ మొత్తాన్ని చూపించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



