'రుద్రమదేవి' వస్తోందోచ్!
on Jun 4, 2015
ఇదిగో వస్తోంది.. అదిగో వస్తోంది.. అంటూ గత కొన్ని నెలలుగా వాయిదాల పర్వంతో వార్తల్లో నిలిచిన 'రుద్రమదేవి' సినిమా ఎట్టకేలకు రెడీ ఫర్ రిలీజ్ అంటోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించడంతో పాటు భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమాలో అనుష్క టైటిల్ రోల్ చేసింది. 'రుద్రమదేవి'ని సంక్రాంతి, సమ్మర్.. ఇలా కొన్ని సీజన్ల టైంలో రిలీజ్‌కి ప్లాన్ చేసుకున్నప్పటికీ.. టెక్నీకల్, ఫైనాన్షియల్ రీజన్స్‌తో పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 26న 'రుద్రమదేవి' రిలీజ్‌కి బెర్త్ సంపాదించుకుందని గుణశేఖర్ అండ్ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. వరల్డ్ వైడ్‌గా సందడి చేయనున్న ఈ సినిమా.. చిత్ర యూనిట్ పడ్డ కష్టాలన్నింటిని మరిచిపోయేలా రిజల్ట్‌ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. అల్లు అర్జున్, రానా, నిత్యా మీనన్, కేథరిన్ ట్రెసా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన 'రుద్రమదేవి'కి ఇళయరాజా సంగీతమందించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
