శ్రీకాంత్ కొడుకు రోషన్ లవ్ స్టోరీ! దర్శకుడు ఎవరో తెలుసా!
on Jun 3, 2025

శ్రీకాంత్(Srikanth)నట వారసుడు రోషన్(Roshan)2016 లో 'నిర్మల కాన్వెంట్' అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2021 లో 'పెళ్ళి సందడి' తో ప్రేక్షకులని అలరించిన రోషన్, ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న 'ఛాంపియన్' అనే మూవీ చేస్తున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి' వృషభ' అనే పాన్ ఇండియా మూవీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
రీసెంట్ గా 'హిట్ 3 ' తో విజయాన్ని అందుకున్న శైలేష్ కొలను(Sailesh Kolanu)దర్శకతంలో రోషన్ ఒక సినిమా చేస్తున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతుందని, ఒక కొత్త రోషన్ ని ఈ చిత్రం ద్వారా చూడబోతున్నారని అంటున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ భారీ బడ్జెట్ తో రోషన్ చిత్రాన్ని తెరకెక్కించబోతుందని, త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందనే వార్తలు సినీ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



