టెన్షన్ లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్
on Jun 3, 2025
2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందం, టాక్సీవాలా వంటి చిత్రాల తర్వాత స్టార్ హీరో 'విజయ్ దేవరకొండ'(VIjay Devarakonda)కెరీర్ లో మరో హిట్ లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో 'కింగ్ డమ్' అనే మూవీ చేస్తున్నాడు. నాచురల్ స్టార్ 'నాని' కి జెర్సీ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri)దర్శకుడు. దీంతో కింగ్ డమ్ పై విజయ్ తో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 4 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. ఇప్పటికే రిలీజై న టీజర్ తో అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. నటనకి సంబంధించి విజయ్ లో ఉన్న మరో కొత్త కోణం 'కింగ్ డమ్'(KIngdom)ద్వారా కనువిందు చేయనుందని కూడా టీజర్ తో అర్ధమవుతుంది. దీంతో కింగ్ డమ్ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి అడుగుపెడుతుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తు ఉన్నారు. షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందనే వార్తలు వచ్చాయి.
అలాంటి ఈ టైం లో 'కింగ్ డమ్ కి సంబంధించిన ఫైనల్ కట్ ని గౌతమ్ తిన్ననూరి చూసుకున్నాడని, కొన్ని సీన్స్ విషయంలో సంతృప్తి చెందకపోవడంతో రీ షూట్ చెయ్యాలని భావించి, గోవాలో వాటిని చిత్రీకరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ ఈ విషయాన్నీ బయటకి రాకుండా జాగ్రత్త పడినా కూడా, ఈ న్యూస్ బయటకి వచ్చిందని అంటున్నారు. దీంతో విజయ్ అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. రిలీజ్ కి ఇంకా నెల కూడా టైం లేదు. ఆల్రెడీ మూవీ కంప్లీట్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. విజయ్ అయితే ఒక రకంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. అలాంటి టైంలో ఇప్పుడు రిపేర్లు ఏంటని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. ఈ న్యూస్ నిజామా కాదా అనే విషయంలో చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాలని కూడా కోరుతున్నారు.
విజయ్ దేవరకొండ సరసన 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ 'భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)'హీరోయిన్ గా చేస్తుంది. ఇటీవల ఈ ఇద్దరకీ సంబంధించిన కొన్ని పిక్స్ రిలీజ్ అయ్యాయి. ఇద్దరి ఫెయిర్ చాలా బాగుందనే పేరు వచ్చింది. సత్యదేవ్, కౌశిక్ మెహతా కీలక పాత్రల్లో కనిపిస్తుండగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తుండగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
