గోల్కొండలో ఫైట్ చేస్తున్న బన్నీ
on Sep 11, 2013
"ఇద్దరమ్మాయిలతో" చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రేసుగుఱ్ఱం". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గోల్కొండ కోటలో జరుగుతుంది. ఇక్కడ కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడట. ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.