రీ ఎంట్రీకి రేణూ దేశాయ్ రెడీ
on Jan 30, 2020

'బద్రి', 'జానీ' సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కథానాయిక రేణూ దేశాయ్. 'జానీ' తర్వాత ఆమె నటిగా సినిమాలు చేయలేదు. మరాఠీలో దర్శకురాలిగా సినిమా చేశారు. తెలుగులో రైతు సమస్యలపై సినిమా తీయాలనుకుంటున్నట్టు తెలిపారు. దర్శకురాలిగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడమే కాదు... నటిగానూ తెలుగు తెరపై రీ ఎంట్రీకి రేణూ దేశాయ్ సిద్ధమని ప్రకటించారు. మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధమని తెలిపారు.
ఈ శుక్రవారం విడుదలవుతున్న తెలుగు సినిమా 'చూసీ చూడంగానే'లో హీరో తల్లి పాత్రకు మొదట రేణూ దేశాయ్ ను సంప్రదించారు. ఈ సంగతి చెప్పింది ఆమె. "రాజ్ కందుకూరిగారు 'చూసీ చూడంగానే'లో హీరో మదర్ రోల్ ఆఫర్ చేశారు. ఐ లవ్ దట్ రోల్. కానీ, హెల్త్ బాలిక చేయలేకపోయా. ఆయన నెక్స్ట్ సినిమాలో మంచి రోల్ ఇస్తే చేస్తా" అని రేణూ దేశాయ్ అన్నారు. ఆ మాట మిగతా నిర్మాతలకు, దర్శకులకు కూడా చెప్పినట్టు అయింది. మదర్ రోల్ బావుంటే చేయడానికి రెడీ అని హింట్ ఇచ్చారు రేణూ దేశాయ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



