కమల్ ప్లేస్ కొట్టేస్తున్న శివకార్తికేయన్
on Apr 10, 2023

సినిమా ఇండస్ట్రీలో ఐదున్నర దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న లెజెండరీ నటుడు కమల్‌హాసన్. నటుడిగా, నృత్య కళాకారుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇంకా ఎన్నో రంగాల్లో విశిష్ట సేవలందించిన సినిమా వ్యక్తిగా తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ ఉన్న వ్యక్తి. అలాంటిది ఆయన ప్లేస్‌ని ఇంకొకరు కొట్టేయడం ఏంటి? అని అనుకుంటున్నారా? కమల్ ప్లేస్ అంటే, ఆల్రెడీ కమల్ ఖర్చీఫ్ వేసుకున్న సీజన్ అని అర్థం. ఇండియన్2 సినిమాతో ఈ ఏడాది దీపావళికి ధమాకా చేయాలనుకున్నారు కమల్‌హాసన్. కానీ ఇంకా ఇండియన్2 షూటింగే పూర్తికాలేదు. ప్రస్తుతం ఫారిన్‌లో ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
''ఇండియన్2 సినిమాను శంకర్ దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నమాట వాస్తవమే. కానీ అప్పటికి ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాదు. అందుకే ఆ సీజన్‌ని వదిలేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ సీజన్ అయిన పొంగల్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు. ఈ సమ్మర్‌కి ఇండియన్2 షూటింగ్ పూర్తయినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం కావాల్సి ఉంది. అందుకే పొంగల్ అయితే బెస్ట్ అని భావిస్తున్నారట మేకర్స్. కమల్‌హాసన్‌లాంటి పెద్ద స్టార్ బరిలో లేరంటే, థియేటర్లలో ఖాళీ కనిపిస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు శివకార్తికేయన్.
ఆయన నటిస్తున్న అయలాన్ సినిమాను దీపావళికి విడుదల చేయాలన్నది ప్లాన్. భారీ వ్యయంతో తెరకెక్కిన సైంటిఫిక్ అడ్వెంచర్ చిత్రం అయలాన్. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శరద్ కేల్కర్ కీ రోల్ చేశారు. దీపావళికి అందరినీ ఆకట్టుకునే బెస్ట్ సినిమా అవుతుందన్నది మేకర్స్ మాట. ఓ వ్యక్తికీ, ఏలియన్‌కీ మధ్య జరిగే ఆసక్తికరమైన కథతో తెరకెక్కుతోంది అయలాన్. శివకార్తికేయన్‌కి ఈ ఏడాది అయలాన్‌తో పాటు ఇంకో రిలీజ్ కూడా ఉంది. అది మావీరన్. ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతోంది మావీరన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



