'గుడుంబా శంకర్'తో కొత్త ట్రెండ్ కి శ్రీకారం!
on Apr 10, 2023

టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ పీక్స్ కి వెళ్ళిపోయింది. హిట్ ప్లాప్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలు నటించిన పలు పాత సినిమాలు మళ్ళీ విడుదలవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా రీరిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే 'ఖుషి', 'జల్సా' వంటి సినిమాలు మళ్ళీ విడుదలై రికార్డు కలెక్షన్స్ తో సత్తా చాటగా.. ఇప్పుడు 'గుడుంబా శంకర్' వంతు వచ్చింది.
పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ జంటగా నటించిన చిత్రం 'గుడుంబా శంకర్'. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ సినిమాకి వీరశంకర్ దర్శకత్వం వహించారు. 2004 సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. పవన్ మ్యానరిజమ్స్, కామెడీ సన్నివేశాలు, మణిశర్మ స్వరపరిచిన పాటలు ఫ్యాన్స్ ని అలరించాయి. 19 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది పవన్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా మళ్ళీ విడుదల చేయబోతున్నారు. అంతేకాదు విడుదలకు ముందు ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక ఫ్లాప్ సినిమాని రీరిలీజ్ చేస్తుండటం, మళ్ళీ దానికి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనుకోవడం ట్రెండింగ్ గా మారింది. ఇదిలా ఉంటే మెగా కాంపౌండ్ నుంచి నాగబాబు నిర్మించిన మరో ఫ్లాప్ మూవీ 'ఆరెంజ్' సైతం ఇటీవల రీరిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టింది. మరి 'గుడుంబా శంకర్' ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



