2020 లో బ్రేకప్ అయ్యింది.. నా పెళ్లి ఎప్పుడో నాకే తెలీదు!
on Sep 4, 2022

రెజీనా కసాండ్ర అందరికీ తెలిసిన నటి. తెలుగులో ఎన్నో మూవీస్ లో నటించింది. అలాగే ఇటీవల 'ఆన్యాస్ ట్యుటోరియల్'లో యాక్ట్ చేసింది. తర్వాత 'శాకిని డాకిని' అనే మూవీలో నటించింది. రెజీనా గతంలో కొంచెం కామెడీ టైపు మూవీస్ లో నటించింది ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్ లో నటించడానికి ఎక్కువగా ఇంటరెస్ట్ చూపిస్తోంది. రీసెంట్ గా రెజినా తో ఓ యూట్యూబ్ షోలో పాల్గొంది. తన లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పింది.
"2020 లో నా లవ్ బ్రేకప్ అయ్యింది. సో కొన్ని రోజులు నాకు నేను టైం ఇచ్చుకోవాలని డిసైడ్ అయ్యాను. నా జీవితంలో ఎవరూ లేరు ఇంక పెళ్లి టాపిక్ అస్సలు అనుకోలేదు. అసలు చేసుకుంటానో లేదో నాకు తెలీదు. ఎందుకంటే నా చిన్న వయసు నుంచి ఇండిపెండెంట్ గా ఉండడం అలవాటు చేసింది మా అమ్మ. కాబట్టి నా లైఫ్ లో ఎవరైనా వున్నారా లేదా అని ఆలోచించను. ఇక ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు నాకు నచ్చినవే" అంటూ చెప్పింది రెజీనా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



