దేవిశ్రీతో సీక్రెట్ గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన పూజిత పొన్నాడ!
on Sep 4, 2022

హీరోయిన్స్ పై రూమర్స్ అనేవి చాలా కామన్. ఆ హీరోని లవ్ చేస్తుంది, ఈ హీరోతో డేటింగ్ లో ఉంది, ఆ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబుతుంది అంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. తాజాగా యంగ్ బ్యూటీ పూజిత పొన్నాడ గురించి కూడా అలాంటి వార్తలే చక్కర్లు కొట్టాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తో ఆమె రిలేషన్ లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన పూజిత తాను ఎవరితోనూ రేలషన్ లో లేనని క్లారిటీ ఇచ్చింది.
43 ఏళ్ళ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉన్నాడు. దీంతో ఆయన ఆ హీరోయిన్ తో లవ్, ఈ హీరోయిన్ తో లవ్ అని వార్తలొస్తుంటాయి. ఇటీవల పూజిత పొన్నాడను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు న్యూస్ వినిపించింది. ఈ క్రమంలో తాజాగా పూజిత స్పందించింది.
"దేవిశ్రీతో నేను రిలేషన్ లో ఉన్నట్లు, రహస్యంగా మేమిద్దరం వివాహం చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు ఆ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో అర్థం కావట్లేదు. ఆయనతోనే కాదు ఎవరితోనూ నేను రిలేషన్ లో లేను. ప్రస్తుతానికి నేను సింగిల్" అని పూజిత చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



