రెజీనా ఒక రేంజ్‌లో రెచ్చిపోయింది !!
on May 16, 2017
.jpg)
టాప్ హీరోయిన్ గా వెలుగొందేందుకు అన్ని అర్హతలు ఉండి కూడా.. కెరీర్ పరంగా వెనుకబడిపోవడం రెజీనాకే చెల్లింది. ఈ అమ్మడిని తమ సరసన నటింపజేసుకొని.. సినిమాల్లో సరసలాడాలని టాప్ హీరోలు ఎందుకు అనుకోరో చాలామందికి అర్ధం కాదు. నిజానికి రెజీనా నవ్వు చూసి ఫ్లాట్ అయిపోయేవాళ్లు లక్షల్లో ఉంటారు. అయినా సరే తెలుగులో మాత్రం ఆమెకు అవకాశాలు అరకొరగా మాత్రమే వస్తున్నాయి. తెలుగువాళ్లు తనను సరిగా పట్టించుకోవడం లేదని తమిళంకు వెళ్లిన రెజినా.. అక్కడ తాజాగా నటించిన ఓ చిత్రంలో ఒక రేంజ్ లో రెచ్చిపోయి నటించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన 'శరవణ్ణన్ ఇరుక్కు బయమెన్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన రెజినా..
ఆ చిత్రంలో చాలా గ్లామరస్ గా నటించడంతోపాటు.. తన సెక్సీ ఎక్సప్రెషన్స్ తోనూ తమిళ తంబీలు తట్టుకోలేనివిధంగా నటించిందని తెలుస్తోంది. అయితే.. హారర్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొంది.. ఈనెల 12న తమిళంలో విడుదలైన ఈ చిత్రం.. కుర్రాళ్లను తప్ప మిగతా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోతోందని తెలుస్తోంది. దాంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని రెజీనా వాపోతోందని సమాచారం. సినిమా అక్కడ హిట్ అయినా కాకపోయినా రెజీనా ఉంది కాబట్టి.. ఆ సినిమా ఎలానూ ఇక్కడ దబ్ అవుతుంది. అప్పుడు మనమూ చూడొచ్చు రెజీనా సోయగాల విన్యాసాలు. ఇకపోతే.. ఈ తమిళ చిత్రం నిరాశపరిచింది కాబట్టి.. తెలుగులో తన తాజా చిత్రం 'నక్షత్రం'తోనైనా తన స్టార్ మారుతుందేమోనని రెజీనా ఆశలు పెట్టుకోవడం ఖాయం!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



