రారండోయ్ రకుల్‌ని చూద్దాం !!
on May 16, 2017
ఇప్పటివరకు నేను చేసిన అన్ని సినిమాల్లో 'రారండోయ్ వేడుక చూద్దాం' సమ్ థింగ్ స్పెషల్ అని.. ఇటువంటి సినిమా చేయాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుందని రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్ధమవుతోంది అందరికీ.. 'రారండోయ్ వేడుక చూద్దాం' ట్రైలర్ చూస్తుంటే! హీరో నాగచైతన్యకు ఈక్వల్ గా రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ ఉండడం.. రకుల్ ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తుంటే.. మిగతా హీరోయిన్స్ కుళ్ళుకునేలా చేస్తోంది. 2011లో ఓ చిన్న 'కెరటం' తెలుగు చిత్ర పరిశ్రమను తాకింది. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. 'వెంకటాద్రి ఎక్సప్రెస్'తో ఒక్కసారి అందరి దృష్టి ఓ కుందనబొమ్మపై పడింది. 'లౌక్యం' విడుదలయ్యాక ఆ కెరటం కాస్తా ఒక్కసారిగా ఎగసిపడింది. ఇక అప్పటినుంచి ఆ అమ్మడు వెనక్కి తిరిగి చూసింది లేదు. 'పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ' వంటి హిట్స్ పడ్డాయి. మధ్యలో 'కిక్-2, బ్రూస్ లీ, కరెంట్ తీగ, విన్నర్' వంటి ఫ్లాపులు వచ్చినా ఆమె కెరీర్ కి ఎఫెక్ట్ పడలేదు. ప్రస్తుతం ఈ అందాలరాశి.. మహేష్ బాబుతో 'స్పైడర్', బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా, తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. ఈనెల 26న వస్తున్న'రారండోయ్ వేడుక చూద్దాం' ట్రైలర్ చూస్తుంటే.. 'రారండోయ్ రకుల్ ని చూద్దాం' అనేలా ఉంది!!