రికార్డ్ ధరకు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' ఓటీటీ రైట్స్!
on Feb 9, 2022

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న థియేటర్స్ లో విడుదల కానుంది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ రికార్డు ధరకి అమ్ముడైనట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల 'పుష్ప' మూవీలో శ్రీవల్లిగా అలరించిన లక్కీ హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో నటిస్తుండటం, 'నేను శైలజ', 'చిత్రలహరి', 'రెడ్' వంటి సినిమాలతో ఆకట్టుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది.
'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సోనీ సంస్థ ఈ సినిమా శాటిలైట్, మ్యూజిక్, ఓటీటీ రైట్స్ ను రూ.25 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుందని సమాచారం. థియేటర్స్ లో విడుదలైన కొన్ని వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ వేదిక సోనీ లివ్ లో సందడి చేయనుందట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



