'బంగార్రాజు' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
on Feb 9, 2022

అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బంగార్రాజు'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. తాజాగా బంగార్రాజు ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
నాగార్జున, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో 2016 సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్ గా 'బంగార్రాజు' తెరకెక్కింది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదలై మరోసారి సోగ్గాడిని సంక్రాంతి విన్నర్ గా నిలబెట్టింది. ఇందులో చిన్న బంగార్రాజుగా చైతన్య ఆకట్టుకోగా, చైతూకి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సందడి చేసింది. పండగ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి, మంచి కలెక్షన్లు రాబట్టి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.
'బంగార్రాజు' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి జీ5 లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలోనూ 'బంగార్రాజు' సినిమా సత్తా చాటుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



