మరోసారి స్నేహితుడి కోసం సాహసం చేస్తున్న మాస్ మహారాజా?
on Dec 30, 2022

మాస్ మహారాజా కొన్ని చిత్రాల తర్వాత క్రాక్ సినిమాతో మరల గాడిలో పడ్డారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీలు తీవ్రంగా నిరాశపర్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నటించిన చిత్రం ధమాకా వసూళ్లపరంగా దూసుకుపోతోంది. లాంగ్ రన్‌లో ఈ సినిమాకి మంచి వసూళ్లు, లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ధమాకా చిత్రం రవితేజకి ఒక హిట్ మూవీ అనే చెప్పవచ్చు. ఇక రవితేజ కెరీర్ విషయానికి వస్తే ఆయన కెరీర్లో కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్‌లకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో దర్శకుడు శ్రీను వైట్లకు కూడా అంతటి ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే రవితేజ లోని స్పార్క్ ను చూసి మొట్టమొదటిసారిగా హీరోగా అతనితో నీకోసం చిత్రం చేసింది ఆయనే.
ఆ తర్వాత కూడా వారి కాంబినేషన్లో వెంకీ, దుబాయ్ శీను వంటి చిత్రాలు వచ్చి సూపర్‌హిట్ అయ్యాయి. దాంతో ఈ జోడి సక్సెస్ఫుల్ కాంబో గా పేరు తెచ్చుకుంది. కానీ ఇటీవల శ్రీనువైట్ల గాడి తప్పరు. వరుసగా ఫ్లాఫ్ చిత్రాలు ఇస్తున్నారు. బాద్‌ష తర్వాత ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ వంటి డిజాస్టర్స్ ని నమోదు చేశారు. ఇలాంటి సమయంలో మాస్ మహారాజా రవితేజ పిలిచి మరి అతనికి అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా ద్వారా అవకాశం ఇచ్చాడు.
కానీ ఈ అవకాశాన్ని కూడా శ్రీనువైట్ల సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఊహించని ఫలితాన్ని అందించింది. దీనికి తోడు రామ్ చరణ్- చిరంజీవిలు పిలిచి మరి అవకాశం ఇస్తే బ్రూస్లీ ద్వారా దాన్ని కూడా చెడగొట్టుకున్నాడు. మెగాస్టార్ తో ఆయన తీసే మొదటి చిత్రం కూడా అందరివాడు కూడా పెద్దగా అలరించలేకపోయింది. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల సినిమా చేసి నాలుగేళ్లవుతోంది. ఆయన దగ్గర కథలున్నప్పటికీ అవకాశాలు ఇచ్చే హీరోలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రవితేజ శ్రీను వైట్లకు పిలిచి మరి అవకాశం ఇచ్చి మరో సాహసానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
వీరిద్దరూ కలిసి ఓ సూపర్ హిట్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని కసిగా వర్క్ చేస్తున్నారట. ముఖ్యంగా ఈ మూవీ నిజమే అయితే శ్రీను వైట్లకు ఇది డూ ఆర్ డై సిట్యుయేషన్ అని చెప్పాలి. ఇటీవల శ్రీనువైట్ల రవితేజకి కథ చెప్పడం... కథ కూడా వెంకీ తరహా ఎంటర్టైనర్ కావడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వచ్చే ఏడాది మార్చిలో సినిమాని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారని సమాచారం. మరి ఇందులో నిజం ఎంత ఉందో చూడాలి....! శ్రీనువైట్లది ఒక సపరేటు రూట్. ఆయన సక్సెస్ ఫార్ములా ఎంటర్టైన్మెంట్.
అతని అగ్ర దర్శకుల స్థానంలో నిలిపింది కూడా ఆయనలోని ఆ టాలెంటే. అయితే కోనా వెంకట్ తో విభేదాలు వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ ఫార్ములా పాతబడిపోయింది. ఒకే మూసలో సినిమాలు తీస్తాడని చెడ్డ పేరు వచ్చింది అలాంటి సమయంలో నేటి జనాల సైకాలజీని స్టడీ చేస్తూ ఒక కొత్త తరహ వినోదాత్మక సినిమాను లైన్లోకి తేవాలన్నది శ్రీను వైట్ల- రవితేజ ప్లాన్లుగా కనిపిస్తోంది. మరి ఇది నిజమైతే మాత్రం శ్రీను వైట్ల -రవితేజ కాంబినేషన్లో వచ్చే మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూడొచ్చు అని చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



