సిగరెట్ విషయంలో రష్మిక కీలక నిర్ణయం.. పేరుని నిలబెట్టుకోవడం కష్టమే రష్మిక
on Jun 30, 2025

రష్మిక(Rashmika Mandanna)రీసెంట్ గా 'కుబేర'(Kuberaa)తో మరో సారి హిట్ ని అందుకుంది. ప్రస్తుతం 'ది గర్ల్ ఫ్రెండ్'(The Gril friend)అనే మూవీలో టైటిల్ రోల్ పోషిస్తుంది. రష్మిక నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోయేది ఈ మూవీనే. రీసెంట్ గా 'మైసా'(Mysaa)అనే మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మైసా పోస్టర్ లోని రష్మిక లుక్ ఇప్పటినుంచే అభిమానులు మైసా కోసం వెయిట్ చేసేలా ఉందని చెప్పవచ్చు.
రీసెంట్ గా రష్మిక 'వి ద ఉమెన్'(V The Women)అనే ప్రోగ్రాంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగతంగా నేను ధూమపానాన్ని ప్రోత్సహించను. అలాంటి సన్నివేశాలు ఉన్న సినిమాల్లో కూడా నటించడానికి ఇష్టపడను. ఒక వేళ మూవీలో నా క్యారక్టర్ కి సిగరెట్ తాగే అవసరం ఉంటే, ఆ మూవీని వదులుకుంటాను. యానిమల్ మూవీని నేను ఒక మూవీ గానే చూస్తాను. సినిమా చూసి ప్రభావితమవుతారని అనుకుంటే, నచ్చిన సినిమాలు మాత్రమే చూడండి. వచ్చిన ప్రతి సినిమాని చూడమని ఎవరు ఎవర్ని బలవంతం చెయ్యరు. అలా బలవంతం చేసే పక్షంలో అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతాయి.
మనుషులందరూ ఒకేలా ఉండరు.ఆ విషయాన్ని యానిమల్(Animal)లో సందీప్ రెడ్డి వంగ(sandeep Reddy Vanga)చెప్పాడు. మేము కూడా ఆర్టిస్టులుగా ఆయా క్యారెక్టర్స్ ని పోషిస్తాం తప్ప, మా వ్యక్తిగత జీవితాలకి సంబంధం ఉండదు. ఇండస్ట్రీ లో పేరు రావడం ఈజీ ఏమో గాని దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



