పవన్ కళ్యాణ్ ఫైర్ లాగా కనపడనున్నారు..ఆ విషయంలో మాటిస్తున్నాను నమ్మండి
on Jun 30, 2025

సితార ఎంటర్ టైన్ మెంట్ పై ఎన్నో హిట్ చిత్రాలు నిర్మిస్తూ, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత నాగవంశీ(Naga Vamsi)లక్కీభాస్కర్, డాకు మహారాజ్, మ్యాడ్ స్క్వేర్ వంటి హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్న నాగవంశీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కింగ్ డమ్(KIngdom)ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్ గా నాగవంశీ 'ఎక్స్' వేదికగా జులై 3 న రిలీజ్ కాబోయే 'హరిహర వీరమల్లు'(Harihara veeramallu)ట్రైలర్ చూసీ అందరు సర్ప్రైజ్ అవుతారు. ట్రైలర్ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారు ఫైర్ లాగా కనిపించడంతో పాటు, భారీ స్థాయిలో మీరు ఎప్పుడు చూడని ఎనర్జీని చూడనున్నారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతే ఎనర్జీ తో మాట్లాడుకుంటారని పోస్ట్ చేసాడు.
కింగ్ డమ్ మూవీ గురించి ట్వీట్ చేస్తు నేను కింగ్ డమ్ కి సంబంధించి ఏం పోస్ట్ చేసినా, అప్పుడప్పుడు తిట్లు వస్తాయని నాకు తెలుసు. నన్ను నమ్మండి ప్రేక్షకులకి వెండి తెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. మూవీ చూసాక మీకు కలిగే అనుభూతిని అంచనా వెయ్యలేరు. ఈ విషయంలో ఖచ్చితంగా మాటిస్తున్నాను. నేను ఎంతో నమ్మితే గాని ఈ విషయం చెప్పను. కింగ్ డమ్ తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్, టీజర్, సాంగ్ అప్ డేట్ తో కలుద్దామని చెప్పాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



