డబ్బింగ్ చెప్పడం అంటే మళ్లీ నటించడమే!
on Feb 4, 2020

'డబ్బింగ్ చెప్పడం అంటే మళ్లీ సినిమా మొత్తం నటించడమే! ఇంకోసారి సినిమాలో యాక్ట్ చేసినట్టే' అంటోంది రష్మిక మందన్న. 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ తర్వాత మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి ఈ కన్నడ కుట్టి రెడీ అవుతోంది. నితిన్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించిన సినిమా 'భీష్మ'. కొన్ని రోజుల క్రితం షూటింగ్ పూర్తయింది. సోమవారం తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసింది రష్మిక. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ఆహ్!!! డబ్బింగ్ చెప్పడం అంటే మళ్ళీ మొత్తం సినిమా నటించినట్టే! 'భీష్మ' డబ్బింగ్ పూర్తి చేశా. ఐ యాం లవింగ్ థిస్. నాకు ఇష్టమే" అని రష్మిక పేర్కొన్నారు.
ఆల్రెడీ భీష్మ సినిమాలో రెండు పాటలను విడుదల చేశారు. సింగిల్స్ యాంథమ్ యువతను ఆకట్టుకుంది. ఇక, తాజాగా విడుదలైన 'వాటే వాటే బ్యూటీ...' ట్రెండింగ్ లిస్టులో చోటు సంపాదించింది. ఇందులో రష్మిక స్టెప్పులకు యువత ఫిదా అవుతోంది. నితిన్ కూడా చాలా రోజుల తర్వాత తనలో డాన్సర్ ను బయటకు తీశాడు. పబ్బుల్లో, క్లబ్బుల్లో, ఆటోల్లో ఎక్కడ చూసినా ఈ పాట వినపడడం ఖాయమని ప్రేక్షకులు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



