రష్మీ ఫస్ట్... అనసూయ నెక్ట్స్!!
on Aug 1, 2019
`జబర్దస్త్ ` టీవీ షోష్ తో అనసూయ, రష్మీలకు విపరీతమైన ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ వల్ల వీరిద్దరికీ సినిమా అవకాశాలు కూడా చాలానే వచ్చాయి. ఒకవైపు టీవీ షోస్ తో సందడి చేస్తూ మరో వైపు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న జబర్దస్త్ బ్యూటీస్ సినిమాలు ఈ నెలలోనే విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక రష్మీ నటించిన `శివరంజని` సినిమా ఈ నెల 2న రాబోతుంటే అనసూయ నటించిన `కథనం` మూవీ ఈ నెల 9న వస్తోంది. ఇలా వారం గ్యాప్ లో జబర్దస్త్ బ్యూటీస్ సినిమాలు విడుదల కానుండటంతో ఇద్దరిలో ఎవరు సక్సెస్ కొడతారు? ఏంటన్న ఆసక్తి మొదలైంది. ఇదిలా ఉంటే రష్మీ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక గత నెల విడుదలైన `స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్` అనే సినిమా డైరక్ట్ చేసిన కుర్రాడు ఈ సినిమాను డైరక్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే అనసూయ కూడా పలు చిత్రాలకు సైన్ చేసినట్లు సమాచారం.