రానా లీక్స్: అందరి జీవితాలతో ఆడుకోనున్నాడు
on Jun 1, 2017
సుచీ లీక్స్ ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగు నటుల వ్యక్తిగత జీవిత రహస్యాలు కూడా బయట పెట్టింది. త్వరలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి కూడా ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ జీవితాలతో ఆడుకోనున్నాడు. సుచీ లీక్స్ లాగ రానా లీక్స్ ఏం పెట్టట్లేదు, కానీ ఒక రియాలిటీ షోకి హోస్ట్ గా చేయనున్నాడు. ఈ షోలో రానా ఇండస్ట్రీ సెలెబ్రిటీలని పిలిచి వాళ్ళ ఫ్రెండ్షిప్స్, రెలాషన్షిప్స్ గురించి చర్చిస్తాడు.
చాలా ఫన్ గా సాగే ఈ షోలో, రానా సినిమాకి సంభందించిన ప్రశ్నలే కాకుండా, సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి కూడా అడగనున్నాడు. మీకు ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి, వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఇలాంటి ప్రశ్నలన్న మాట. క్వశ్చన్ పేపర్ ముందుగానే లీక్ అయ్యే అవకాశం ఉన్నా, షోకి వచ్చిన సెలెబ్రిటీల తమ పర్సనల్ లైఫ్ గురించి ఎంతో కొంత చెప్పక తప్పదు. మరి, షోని ఆర్గనైజ్ చేసేవాళ్ళు రానాని హోస్ట్ చేయడానికి తీసుకొచ్చిన అసలు ఉద్దేశ్యం కూడా అదే కదా. ఇప్పటికే, చిరంజీవి, నాగార్జున లాంటి దిగ్గజాలు బుల్లి తెర లో యాంకర్లుగా అలరించగా, త్వరలో బిగ్ బాస్ ద్వారా ఎన్టీఆర్ కూడా హోస్ట్ గా మారనున్నాడు. ఈ జాబితాలో ఇప్పుడు రానా కూడా చేరుతున్నాడు.