'రానా నాయుడు' రెండో సీజన్ వచ్చేస్తోంది!
on Apr 19, 2023

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సిరీస్ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. మంచి ఆదరణే పొందింది. ఈ ఉత్సాహంతో నెట్ ఫ్లిక్స్ రెండో సీజన్ తో అలరించడానికి సిద్ధమైంది.
వెంకటేష్ కి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే కుటుంబమంతా కలిసి చూడొచ్చనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అయితే దానికి పూర్తి భిన్నంగా 'రానా నాయుడు' వెబ్ సిరీస్ రూపొందింది. ఇందులో ఎన్నో అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయి. వెంకటేష్ ని అమితంగా ఇష్టపడేవారు.. ఆయన అలాంటి సన్నివేశాల్లో నటించడం, ఆయన నోటి వెంట అభ్యంతరకర మాటలు వినపడటం తట్టుకోలేకపోయారు. అసలు వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో ఇలాంటి సిరీస్ లో నటించడం ఏంటని ఎందరో పెదవి విరిచారు. అయితే ఎన్నో అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమైనా ఈ సిరీస్ కి నెట్ ఫ్లిక్స్ లో అదిరిపోయే ఆదరణ లభించింది. నెట్ ఫ్లిక్స్ లో టాప్ సిరీస్ లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దీంతో రెండో సీజన్ కి శ్రీకారం చుట్టారు. త్వరలో రానా నాయుడు సీజన్-2 రాబోతుందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. మరి ఇంకా రెండో సీజన్ లో ఎలాంటి సన్నివేశాలు, సంభాషణలతో షాక్ ఇస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



