తొలిప్రేమను గుర్తు చేస్తున్న రానా..!!
on Aug 11, 2018
హీరో, విలన్ అనే తేడా లేకుండా విభిన్న పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న రానా.. త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నారు.. కొత్త అవతారం అంటే సినిమాలో పాత్ర కాదులేండి.. త్వరలో రానా సమర్పణలో ఒక సినిమా మన ముందుకి రాబోతుంది.. ఆ సినిమా పేరు కేరాఫ్ కంచరపాలెం.

వైజాగ్ దగ్గరలో ఉన్న కంచెరపాలెం నేపథ్యంలో సాగే భిన్నమైన ప్రేమకథ ఇది.. వెంకటేశ్ మహా దర్శకత్వంలో నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాని చూసిన రానా, నచ్చి తానే విడుదల చేయడానికి ముందుకొచ్చారు.. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 15న, సినిమాను సెప్టెంబరు 7న విడుదల చేయనున్నట్లు రానా ప్రకటించారు.. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రానా.. 'ఈ ప్రేమకథతో వయసు అనే సంఖ్యకు సంకెళ్లు వేద్దాం.. ప్రేమ- అవధులు లేనిది, అభిప్రాయాలకు అందనిది.. మీ మొదటి ప్రేమని గుర్తుచేసి గిలిగింతలు పెట్టే కథ' అంటూ ట్వీట్స్ చేసారు.. మరి రానా చెప్పినట్టు కంచరపాలెం సినిమా తొలిప్రేమను గుర్తుచేస్తూ గిలిగింతలు పెడుతుందో లేదో తెలియాలంటే సెప్టెంబరు 7 వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



