మహేష్ సినిమాలో సీనియర్ నటీమణులు
on May 4, 2019
ఈ నెల 9న మహేష్ 25 వ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బోయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి మహేష్ 26వ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ విజయ్ శాంతి రీ ఎంట్రీ ఇస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయశాంతి మహేష్ అత్తగా నటింబోతున్నట్లు సమాచారం. అలాగే మరో సినియర్ నటి రమ్యకృష్ణ కూడా ఈ సినిమాలో మహేష్ అమ్మగా నటిస్తోందట. ఇలా ఇద్దరు సీనియర్ నటీమణులను ఇటీవల తన కథతో ఒప్పించాడట అనిల్ రావిపూడి. ఈ సినిమాకు సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.