బుల్లి మగధీరను కలిసిన రామ్‌చరణ్
on Mar 16, 2015
.jpg)
ఇటీవల యూ ట్యూబ్‌లో ఓ వీడియో హల్ చల్ చేసింది. మెగా అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఓ బుడతడు... మగధీరలోని రామ్‌చరణ్ డైలాగ్‌ని గుక్కతిప్పుకోనివ్వకుండా చెప్పేశాడు. ఆ వీడియోకి లైకులూ, షేర్లూ తెగ వచ్చాయి. ఆ తరవాత నుంచి ఆ బుడ్డోడు ఎవడు?? అంటూ ఆరాలు మొదలయ్యాయి. రామ్‌చరణ్ స్వయంగా `వాడ్ని కలుసుకోవాలని వుంది` అంటూ మనసులోని మాట బయటపెట్టాడు. చివరికి రామ్‌చరణ్ ఆ బుల్లి మగధీరుడ్ని కలుసుకొన్నాడు. బుడ్డోడి చేత మళ్లీ ఓసారి ఆ డైలాగ్ చెప్పించుకొని ఆనందించాడు. ఆ కుర్రవాడి పేరు.. పరశురామ్. వాళ్లది నిరు పేద కుటుంబం. ఈ విషయాలు తెలుసుకొన్న చరణ్... పరశురామ్ చదువుల ఖర్చు మొత్తం నేనే భరిస్తా అంటూ మాటిచ్చాడట. కొన్ని బహుమానాలు ఇచ్చి.. పరశురామ్‌ని సంతోష పెట్టి మరీ పంపాడట. తన అభిమాన హీరోని కలుసుకొన్న ఆనందం ఒకవైపు, ఇక నుంచి బడికి వెళ్లొచ్చన్న సంతోషం మరోవైపు... వీటితో పరశురామ్ ఆనందంగా ఇంటికెళ్లిపోయాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



