చెర్రీ.. కావాలి ఓ లవ్ స్టోరీ!
on Aug 22, 2016
ఆరెంజ్ తరవాత మళ్లీ లవ్ స్టోరీల జోలికి వెళ్లలేకపోయాడు రామ్‌చరణ్. మగధీర తరవాత వచ్చిన ఆరెంజ్ అంచనాలు అందుకోలేక చతికిలపడింది. చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అందుకే.. అసలు లవ్ స్టోరీ చేద్దామన్న ఆలోచననే కల్లోకి కూడా రానివ్వలేదు. అయితే... ఇప్పుడు మళ్లీ ప్రేమకథలవైపు దృష్టి పెట్టాడట. వరుసగా యాక్షన్, కమర్షియల్ సినిమాలు చేసుకొంటూ వెళ్తున్న చరణ్ ఇప్పుడు `నాకు అర్జెంటుగా లవ్ స్టోరీ కావాలి` అంటున్నాడట. అయితే లవ్ స్టోరీలోనూ ఓ కొత్త కాన్సెప్ట్ ఉంటే ఓకే చేస్తానని ఆఫర్ ఇచ్చాడట. ప్రేమకథా చిత్రాలు తీయాలంటే యువ దర్శకులకే సాధ్యం. అందుకే ఓ యువ దర్శకుడ్ని పిలిపించుకొన్నాడట చరణ్. ప్రస్తుతం మేర్లపాక గాంధీతో చరణ్ చర్చలు జరుగుపున్నాడని తెలుస్తోంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా అంటూ రెండు హిట్లు ఇచ్చాడు మేర్లపాక గాంధీ. ఇప్పుడు చరణ్ కోసం ఓ లవ్ స్టోరీ తయారు చేస్తున్నాడట. ఆ కథ నచ్చితే.. తని ఒరువన్ తరవాత చరణ్ పట్టాలెక్కించే సినిమా ఇదే అవుతుందని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



