తమిళ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా?
on Oct 14, 2020
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తరవాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఏది? ఠక్కున చెప్పడం కష్టమే. 'ఆర్ఆర్ఆర్'లో మరో హీరో ఎన్టీఆర్ చేతిలో త్రివిక్రమ్ సినిమా ఉంది. 'అరవింద సామెత వీర రాఘవ' తరవాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి దానికి క్రేజ్ ఉంటుంది. కానీ, రామ్ చరణ్ చేతిలో అటువంటి సినిమా ఏదీ లేదు. ఫలానా దర్శకుడితో చరణ్ సినిమా చేయవచ్చని ప్రస్తుతానికి పలువురి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, తమిళ దర్శకుడు మోహన్ రాజాతో సినిమా దాదాపు ఖాయమైనట్టు సమాచారం.
రామ్ చరణ్ హీరోగా నటించిన 'ధృవ' సినిమా గుర్తుంది కదా! తమిళ సినిమా 'తని ఒరువన్'కి అది రీమేక్. ఆ సినిమాకి మోహన్ రాజా దర్శకుడు. ఇప్పుడు అతడితో చరణ్ సినిమా చేయనున్నాడు. మోహన్ రాజా తెలుగు అబ్బాయే. ఆయన ఎడిటర్ మోహన్ కుమారుడు. తమిళ హీరో జయం రవికి సోదరుడు. తమిళ పరిశ్రమలో దర్శకుడిగా స్థిరపడ్డారు. ఒకవేళ ఓకే అయితే చరణ్ సినిమాతో అతడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
