సేమ్ టు సేమ్.. మురళీధరన్ నోట్లో నుంచి ఊడిపడినట్లున్న విజయ్ సేతుపతి!
on Oct 14, 2020
విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తోన్న శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' మోషన్ పోస్టర్ను మంగళవారం సామంత్రం ఆవిష్కరించారు. తన విశిష్టమైన జీవితంలో దిగ్గజ క్రికెటర్ ఎదుర్కొన్న కష్టాల సంగ్రహావలోకనాన్ని ఈ పోస్టర్ మనకు అందిస్తోంది. శ్రీలంక టెస్ట్ క్రికెట్ జట్టుకు సంబంధించిన వైట్ జెర్సీ ధరించిన విజయ్ సేతుపతి అచ్చుగుద్దినట్లు, ఇంకా చెప్పాలంటే మురళీధరన్ నోట్లో నుంచి ఊడిపడినట్లు అలాగే కనిపిస్తున్నాడు. ఈ బయోపిక్ కోసం విజయ్ సేతుపతి స్టన్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అతని అభిమానులను అమితంగా ఆశ్చర్యపరుస్తోంది.
ఈ సినిమాని నిర్మిస్తోన్న మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఒక అఫిషియల్ పోస్టర్ ద్వారా ఈ ప్రాజెక్టును గత వారం ప్రకటించాయి. ఎం.ఎస్. శ్రీపతి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ క్రికెటింగ్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ జీవితం, ఆయన ఎదుర్కొన్న కష్టాల ఆధారంగా రూపొందుతోంది. మంగళవారం (అక్టోబర్ 13)న స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ చానళ్లలో ఈ మూవీ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ పోస్టర్ను ఆవిష్కరించారు.
Also Read