`#RC 15`.. హీరోయిన్ రోల్ అదేనా?
on Apr 17, 2021
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. జూలై నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ పాన్ ఇండియా మూవీ.. 2022 ద్వితీయార్ధంలో థియేటర్స్ లో సందడి చేయనుందని టాక్.
ఇదిలా ఉంటే.. `#RC 15` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ యువ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కథానాయిక పాత్రకి సంబంధించి కూడా ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో హీరోయిన్ రోల్ జర్నలిస్ట్ అట. సీఎంకి, జర్నలిస్ట్ కి మధ్య సాగే సీన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని బజ్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
చరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీ కోసం హీరోయిన్ గా రష్మిక మందన్న, రకుల్ ప్రీత్ సింగ్, అలియా భట్.. ఇలా పలువురు ప్రముఖ కథానాయికల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఎవరు ఫైనల్ గా కన్ఫామ్ అవుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.