'విరాట పర్వం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్
on Jun 14, 2022

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'విరాట పర్వం'. 1990లలో తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ ప్లాన్ చేశారు.
జూన్ 15వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో 'విరాట పర్వం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్స్ గా విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ హాజరు కానున్నారు. అబ్బాయి రానా వేడుకలో బాబాయ్ వెంకటేష్ సందడి చేయడం కామన్. అందుకే ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. రానా, చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. మరి తన ఫ్రెండ్ గురించి, సినిమా గురించి చరణ్ ఏం మాట్లాడతాడనేది ఆసక్తికరంగా మారింది.
.webp)
పైగా ఈ సినిమాలో వెన్నెల అనే ప్రధాన పోషించిన సాయి పల్లవిని గతంలో సుకుమార్ ఓ సినిమా వేడుకలో లేడీ పవన్ కళ్యాణ్ అని ఆకాశానికెత్తేశాడు. ఇప్పుడు నిజంగానే ఆమెని అందరూ లేడీ పవన్ కళ్యాణ్ అంటున్నారు. దీంతో సుకుమార్ స్పీచ్ కోసం కూడా అందరూ బాగానే ఎదురుచూస్తున్నారు. మరోవైపు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తో సాయి పల్లవిని పోలుస్తున్న విషయంపై చరణ్ ఏమైనా కామెంట్స్ చేస్తాడేమో చూడాలి.
'విరాట పర్వం'లో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతం అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



