సీనియర్ హీరోతో రకుల్ రొమాన్స్!!
on Jul 23, 2019

వెర్సాటైల్ యాక్టర్ కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో `భారతీయుడు-2` చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బడ్జెట్ కారణాల వల్ల కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ సినిమా త్వలరో మళ్లీ ప్రారంభం కానుందని ఇటీవల కోలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందిన విషయం కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఇప్పటికే కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే మరో ఇద్దరు నటీమణులను కీలకమైన పాత్రల కోసం తీసుకున్నారట. వారిలో బిల్ కుల్ భామ రకుల్ ఒకరుగా తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రజంట్ కమల్ హాసన్ తమిళ్ బిగ్ బాస్ -3లో బిజీ గా ఉండటం వలన షూటింగ్ కొంత ఆలస్యంగా జరుగుతోంది. లైకా ప్రొడక్షన్స్ బేనర్ పై సుభాష్ కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన `భారతీయుడు` చిత్రానికి సీక్వెల్ గా రాబోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



