రజనీకాంత్ వింత కోరిక
on Dec 18, 2019
ప్రతి కథానాయకుడికి డ్రీమ్ రోల్ అంటూ ఏదో ఒకటి ఉంటుంది. ఫలానా పాత్రలో నటించాలని ఉందంటూ తమ మనసులో కోరికను ఏదో ఒక సందర్భంలో బయటపెడతారు. సుమారు 45 ఏళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా తన మనసులో కోరికను ముంబైలో జరిగిన 'దర్బార్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో బయటపెట్టారు. ఆయన వెండితెరకు పరిచయమైన సినిమా 'అపూర్వ రాగంగాళ్'లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు. తర్వాత ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా డిఫరెంట్ రోల్స్ చేశారు. మరి, ఆయన చేయాలనుకుంటున్న డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా? ఊహించగలరా?
"నాకు ట్రాన్స్‌జెండర్ రోల్ చేయాచాలని ఉంది. నా డ్రీమ్ అది" అని రజనీకాంత్ అన్నారు. ఆయన మనసులో వింత కోరికను బయటపెట్టారు. ఇటీవల వచ్చిన 'మామాంగం'లో మమ్ముట్టి కొంత సమయం ట్రాన్స్‌జెండర్ తరహా పాత్రలో కనిపించారు. అలాగే, 'కాంచన'లో శరత్ కుమార్, రాఘవ లారెన్స్ కూడా. మరి, రజనీ కోరికను ఎవరైనా దర్శకులు, రచయితలు వింటున్నారో? లేదో? నటుడిగా తనకు అమితాబ్ బచ్చన్ స్ఫూర్తి అని రజనీకాంత్ అన్నారు. "రెగ్యులర్ గా వ్యాయామాలు చేయమని, ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండమని, రాజకీయాల్లోకి వెళ్లవద్దని అమితాబ్ నాకు సలహా ఇచ్చారు. మొదటి రెండు సలహాలు పాటిస్తున్నా.మూడో సలహా పాటించలేదు" అని రజనీకాంత్ అన్నారు. ఆయన రాజకీయ పార్టీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.