బాలకృష్ణతో వంద సినిమాలైనా చేస్తా!
on Dec 18, 2019

నటసింహం నందమూరి బాలకృష్ణతో వంద సినిమాలైనా చేస్తానని సోనాల్ చౌహన్ అంటోంది. 'లెజెండ్', 'డిక్టేటర్'లో బాలకృష్ణ పక్కన కథానాయికగా నటించిన ఈమె, శుక్రవారం విడుదలవుతోన్న 'రూలర్'లో ముచ్చటగా మూడోసారి బాలకృష్ణతో నటించింది. బాలయ్యతో నటించే అదృష్టం తనకు మూడుసార్లు దక్కిందని సంతోషం వ్యక్తం చేసింది సోనాల్ చౌహన్. బాలకృష్ణతో మళ్లీ మళ్లీ నటించడానికి తాను సిద్ధమని, ఎన్ని సినిమాల్లో కుదిరితే అన్ని సినిమాల్లో ఆయనతో నటిస్తానని ఆమె తెలిపింది. సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణపై సోనాల్ చౌహన్ పొగడ్తల వర్షం కురిపించింది. 'లెజెండ్' సినిమా నాటి సంగతులు గుర్తు చేసుకుంది.
"నాకు 'లెజెండ్'లో అవకాశం వచ్చినప్పుడు... బాలకృష్ణగారు సూపర్ స్టార్ అని తెలుసు. అయితే ఆయన్ను కలిసి మాట్లాడకముందు చాలా భయపడ్డాను. పెద్ద స్టార్ హీరో. ఎలా ఉంటారో... ఏంటో అనుకున్నా. కానీ, ఒక్కసారి కలిసి మాట్లాడిన తర్వాత రెండు నిమిషాల్లో నా భయమంతా పోయింది. బాలయ్య చాలా సరదా మనిషి. ఆయనది ఫ్రెండ్లీ నేచర్. కేరింగ్ పర్సన్. నేను ఎంతో కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకున్నారు" అని సోనాల్ చౌహన్ చెప్పింది. సినిమాలో గ్లామర్ రోల్ చేశానని స్పష్టం చేసింది. ఆల్రెడీ రిలీజైన ఒక ప్రోమోలో బికినీలో కనిపించిన సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



