నాతో పోటీపడే స్థాయి మరెవరికీ లేదు: రాజేంద్రప్రసాద్
on Mar 25, 2015
కళాకారుల జీవితాల్లో మంచి మార్పు కోసమే ‘మా’ అధ్యక్షుడిగా పోటీచేస్తున్నానని నటుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. సేవ చేయడానికి మనసు, సంకల్పం ఉంటే చాలునని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆస్తులు వెంట రావని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా హాస్యంతో సినీ కళామాతల్లికి సేవచేశానన్నారు. ఇదొక ధర్మ యుద్ధమని, ఈ ధర్మయుద్ధంలో మంచి చేయడానికి రావడమే పాపమా? అని రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పోటీపడే స్థాయి మరెవరికీ లేదని వ్యాఖ్యానించారు. తెలుగు వాడిగా పుట్టిన దౌర్భాగ్యం వల్లే.. అంతర్జాతీయ సినిమా చేసినా గుర్తింపు రాలేదని రాజేంద్రప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
