ఇతనికోసం దర్శకులు కొత్త పాత్రలు సృష్టిస్తారట
on May 3, 2014

ప్రముఖ నటుడు రాజశేఖర్ కు ప్రస్తుతం మంచి రోజులు వచ్చాయని ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ... "మహంకాళి తర్వాత మూడేళ్ళపాటు మరొక సినిమా చేయలేకపోయాను. చాలా కథలు విన్నాను కానీ ఏది కలిసి రాలేదు. ఇటీవల మాత్రం అన్నీ బాగా కుడురుతున్నాయి. నెలకి ఒకటి చొప్పున వరుసగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇకపై దర్శకులు నా గురించి కొత్త తరహ పాత్రలు సృష్టిస్తారన్న నమ్మకం ఉంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పట్టపగలు" చిత్రంలో మంచి పాత్రలో నటించాను. జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే "వందకి వంద" చిత్రం కూడా త్వరలోనే రాబోతుంది. అదే విధంగా తాజాగా "గడ్డం గ్యాంగ్" అనే చిత్రం ప్రారంభించాము. ఇది కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది" అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



