'రాధేశ్యామ్' అప్డేట్.. ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్!
on Dec 18, 2021
.webp)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రాధేశ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. అందులోభాగంగా డిసెంబర్ 23 న హైదరాబాద్ లో భారీ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ మేకర్స్ తాజాగా అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు.
బాహుబలి సిరీస్ తో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమానే. దీన్ని దృష్టిలో పెట్టుకునే 'రాధేశ్యామ్' మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీస్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 23 న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ నేషనల్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇండియాలో ఒక మూవీకి ఇలా నేషనల్ ఈవెంట్ నిర్వహించడం ఇదే మొదటిసారని అంటున్నారు. ఈ ఈవెంట్ లో ట్రైలర్ ను కూడా లాంచ్ చేయనున్నారు. అది కూడా ఫ్యాన్స్ చేతుల మీదుగా ట్రైలర్ ని విడుదల చేస్తుండటం విశేషం.

'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశముందని అంటున్నారు. ఎస్ఎస్ రాజమౌళి, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



