అబ్బా... దించేసాడు పో...!
on Dec 7, 2013
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "రేసుగుర్రం". అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ వీడియోను నేడు(డిసెంబర్ 7) దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఈ వీడియోలో కేవలం బన్నీ పరిగెత్తుకుంటూ వచ్చే సీన్, అలా వచ్చేటప్పుడు వచ్చే పవర్ తో పాటు.. అక్కడ ఉన్న విలన్ కళ్ళలో భయం కనిపించే తీరుని మాత్రమే పెట్టడం జరిగింది.
ఇదిలా ఉంటె ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరికి "ఊసరవెల్లి" సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ గుర్తొస్తుంది. ఇందులో కూడా హీరో ఇలాగె పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ అక్కడ హీరో ఇంట్రడక్షన్ గురించి వేరే ఒక వ్యక్తి చెబుతుంటాడు. ఈ రెండు సినిమాలకు ఒకే దర్శకుడు కావడం వల్ల ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కానీ... సినిమా విడుదలైతే కానీ తెలియదు ఆ సన్నివేశం ఎందుకు అలా వచ్చిందో అనే విషయం.