హిందీలో రేసుగుర్రం రికార్డులు
on Apr 22, 2014

అల్లు అర్జున్ "రేసుగుర్రం" రోజు రోజుకో రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఓవర్ సీస్ లో కూడా భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ తర్వాత ఓవర్ సీస్ లో మిలియన్ క్లబ్ లోకి చేరిన రెండో మెగా హీరో బన్నీ. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట కొంతమంది హిందీ దర్శక,నిర్మాతలు. హిందీలో డబ్బింగ్ చేసి తమ ఛానెళ్ళలో ప్రసారం చేసుకోవడానికి అక్కడి టీవీ ఛానెళ్ళు పోటీ పడుతున్నాయి. దీనికోసం భారీ మొత్తంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు మహేష్, ఎన్టీఆర్, చరణ్ సినిమాలు మాత్రమే అంతటి రేంజులో అమ్ముడుపోయాయి. కానీ ఇపుడు బన్నీ కూడా అందులో చేరిపోయాడు. ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం ఇప్పటికే పోటీ మొదలయ్యింది. చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు సురేందర్ రెడ్డికి మంచి ఘనవిజయం దక్కిందనే చెప్పుకోవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



