బ్రహ్మీ హీరోగా నాక్కొంచెం తిక్కుంది...!
on Apr 22, 2014
పైన బట్ట... కింద పొట్ట... ఆయన వయసుకు, మనసుకు అసలు తేడా లేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఈయన రేంజే వేరు. ఈ వయసులో కూడా ఆయన హీరో అంటే ఎవరైనా నమ్ముతారా? "గబ్బర్ సింగ్" లో పవన్ కళ్యాణ్ చెప్పిన "నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది" అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇపుడు ఇదే డైలాగ్ ను ఆ బట్టతల వ్యక్తీ సినిమాకు టైటిల్ గా పెట్టి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇంతకీ అతను ఎవరో మీకు తెలిసిందా? అతనే కమెడియన్ బ్రహ్మానందం. బ్రహ్మీ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.