బుల్లితెరపై 'ఆర్ఆర్ఆర్' సందడి.. టీఆర్పీ రేటింగ్స్ లో కొత్త రికార్డు ఖాయం!
on Aug 11, 2022

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. మార్చ్ 25న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. మే 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ హాలీవుడ్ స్టార్స్ ని సైతం ఫిదా చేసింది. వరల్డ్ వైడ్ గా ఎన్నో సంచనాలు సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు బుల్లితెరపై అలరించడానికి సిద్ధమైంది.
'ఆర్ఆర్ఆర్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి ముహూర్తం ఖరారైంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఒక రోజు ముందుగా ఆగస్టు 14న బుల్లితెరపై 'ఆర్ఆర్ఆర్' సందడి చేయనుంది. 'స్టార్ మా'లో సాయంత్రం 5:30 కి తెలుగు, ఏషియన్ నెట్ లో రాత్రి 7 గంటలకు మలయాళం, జీ సినిమాలో రాత్రి 8 గంటలకు హిందీ భాషల్లో ప్రసారం కానుంది.

థియేటర్స్, ఓటీటీలో ఎన్నో సంచలనాలు సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'.. టీవీలలో టీఆర్పీ రేటింగ్స్ పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



