పది కోట్లు వదులుకున్నాడు.. అదే బన్నీకి, బాలీవుడ్ హీరోలకి తేడా!
on Aug 11, 2022

'పుష్ప: ది రైజ్' సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకునేందుకు బడా బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇటీవల ఆయన చాలా యాడ్స్ లో నటించాడు. ఆయనకు ఒక్కో యాడ్ కి రూ.7-8 కోట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆయనకు ఒక పొగాకు ఉత్పత్తుల కంపెనీ నుంచి రూ.10 కోట్ల ఆఫర్ రాగా, ఆయన రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
కూల్ డ్రింక్, ఫుడ్ డెలివరీ యాప్, పైప్స్ ఇలా రకరకాల ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న బన్నీ.. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఏ మాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ప్రస్తుతం తాను తీసుకుంటున్న దానికంటే ఎక్కువ మొత్తం ఇస్తామని ఆఫర్ వచ్చినా.. పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి బన్నీ ఓకే చెప్పలేదు.
కేవలం కాసేపు కెమెరా ముందు నటిస్తే పది కోట్లు వస్తాయని తెలిసినా బన్నీ ఆ యాడ్ లో నటించకపోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఎందరో బాలీవుడ్ హీరోలు పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తుంటే, బన్నీ మాత్రం ప్రజల గురించి ఆలోచించి కోట్లు వదులుకున్నాడు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



