ఆర్జీవీ... ఇక ఆపేయమ్మా. చూళ్లేకపోతున్నాం!
on Nov 12, 2014
.jpg)
రాంగోపాల్ వర్మ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంబొట్టులా తయారవుతోంది. ప్రతీ సినిమాకీ ఓ పదగడుగు లోతుకి దిగజారిపోతున్నాడేమోఅనిపిస్తోంది. ఐస్ క్రీమ్ 2 పోస్టర్లు, ప్రచార చిత్రాలూ చూస్తే మరోసారి వర్మపై జాలితో కూడిక కోపం వచ్చేస్తున్నాయ్. ఈ సినిమాలోని ఐస్ ఫ్రూట్... ఐస్ ఫ్రూట్ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాట ఫక్త్ థర్డ్ గ్రేడ్ పాటలో ఉందంటే నమ్మండి. కథానాయిక నవీన చెడ్డీలతో కనిపించి రెచ్చిపోయింది. కప్పుకొన్నది తక్కువ, విప్పుకొన్నది ఎక్కువ అన్నట్టు కనిపించింది. నందు కూడా ప్రతీ షాట్‌లోనూ నవీనను ఆశగా ఆవహించుకోవడానికి చూస్తుంటాడు. ఆ పాటలో పదాలు వినిపించాలే గానీ, బోలెడు బూతులున్నాయ్. పోనీ తెరకెక్కించిన తీరేమైనా బాగుందా అంటే.. సెల్ ఫోన్ కెమెరాలో సినిమా తీసినంత క్లారిటీ.. అటు క్వాలిటీ, ఇటు క్రియేటివిటీనే కాదు, క్లారిటీ కూడా మిస్సయిపోయాడు వర్మ. శివ, సత్య, సర్కార్‌లు తీసిన వర్మని ఇలాంటి దుస్థితిలో చూస్తామని సామాన్య ప్రేక్షకుడు కూడా ఊహించి ఉండడు. వర్మ ఇంకా అథపాతాళలోకి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నా.. చూడ్డానికి మాత్రం ప్రేక్షకులు సిద్ధంగా లేరమ్మా..! ఆర్జీవీ ఇక ఆపేయమ్మా.. చూడలేకపోతున్నాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



