మహేష్ కొత్త ఫోటో బయటకొచ్చింది
on Nov 12, 2014
సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూణెలో జరుతున్నప్పటికి ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి న్యూస్ బయటికి రాకుండా యూనిట్ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. లేటెస్ట్ గా ఈ చిత్ర లోకేషన్ లో తీసిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోలో మహేష్, శృతిహాసన్ సీన్ చేయడానికి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. శృతి హాసన్ పంజాబీ డ్రెస్ లో సింపుల్ లుక్ తో మెరుస్తుండగా, ప్రిన్స్ ఫుల్ టీ షర్టు, జీన్స్ తో అదరగొడుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



